బాలయ్య బాబు ఆహా వేదికగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ లో పవన్ చేసిన తొలి ఎపిసోడ్ విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు నర్సులపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆ మాటలపై నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, నర్సులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే, ఈ విషయంపై తాజాగా బాలయ్య బాబు క్లారిటీ ఇస్తూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇంతకీ బాలయ్య బాబు తన పోస్ట్ లో ఏం చెప్పారు ?, తన కామెంట్స్ పై ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం రండి.
‘‘అందరికీ నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి వారి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’’ అని బాలయ్య బాబు అన్నారు.
మరి, బాలయ్య వివరణ తోనైనా ఈ నర్సుల వివాదం ఇక్కడితో సమాప్తం అవుతుందని ఆశిద్దాం. నిజానికి బాలయ్య ఆ కామెంట్స్ సరదాగా చేసినవి. పైగా గతంలో తాను అలా అనుకున్నాను అని మాత్రమే బాలయ్య కామెంట్స్ చేశారు. నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, నర్సులు ఇకనైనా ఈ వివాదానికిఫుల్ స్టాప్ పెట్టాలి.
ఇవి కూడా చదవండి…