వేటగాడు లుక్‌లో బాలయ్య అదుర్స్‌

411
ntr biopic
- Advertisement -

నందమూరి బాలకృష్ణ -క్రిష్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఓ వైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది ఎన్టీఆర్ టీం.

తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా అలరించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆరాధ్య నాయకుడిగా మారాడు. ఎన్టీఆర్ జీవితం చాలా మంది ప్రముఖులతో ముడిపడి ఉంది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. జయప్రద పాత్రలో నటించడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

rakul preet

తెలుగు ప్రజలకు నందమూరి అభిమానులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ . శుభాకాంక్షలతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ లోని వేటగాడు స్టిల్ విడుదల చేశారు. ఆకుచాటు పిందె తడిసే అంటూ అప్పట్లో అన్నగారు వేసిన స్టెప్పులోనే ఇప్పుడు బాలయ్య కనిపించారు. ఈ పిక్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తుంది.

ఇక ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ కనిపించనుంది. ఎన్టీఆర్ హిట్ సినిమాల్లో ఒకటైన వేటగాడు మూవీలోని ఆకు చాటు పిందె తడితే సాంగ్‌ని ఈ సినిమాలో రిమేక్ చేయనున్నారు. సినిమాకు హైలైట్‌గా ఈ సాంగ్‌ నిలవనుందట. ఎన్టీఆర్ సినీరంగ విశేషాలతో జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు , రాజకీయ విశేషాలతో ఎన్టీఆర్ మహానాయకుడుగా జనవరి 24న సంక్రాంతికి ముందుకురానుంది.

- Advertisement -