ఈ ఏడాది స్టార్ హీరోలంతా తమ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఇద్దరు స్టార్ హీరోల నుండి మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. అవును నందమూరి బాలయ్య , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి ఈ ఏడాది సినిమా రాలేదు. గతేడాది ఇద్దరూ అఖండ , పుష్ప సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర భారీ సౌండ్ చేశారు. టికెట్ రెట్లు తక్కువ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళు రాబట్టారు.
అలాంటి ఈ ఇద్దరు స్టార్స్ ఈ ఇయర్ ను మిస్ కొట్టారు. అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ తర్వాత పుష్ప 2 సెట్స్ పైకి తెచ్చేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఇటివలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా నెలలు తీసుకోవడంతో బన్నీ కి ఆటోమేటిక్ గా గ్యాప్ వచ్చేసింది. రెండేళ్ళు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ డెలివరీ చేసిన బన్నీ ఈ ఇయర్ మాత్రం గ్యాప్ తీసుకోలేదు వచ్చింది అనేశాడు.
ఇక బాలయ్య కూడా గోపీచంద్ మలినేని సినిమాతో ఈ ఏడాది థియేటర్స్ లోకి రావాలని చూశాడు. కానీ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ మధ్యలో అన్ స్టాపబుల్ షూట్ చేయడంతో సినిమా సంక్రాంతి పోటీలో నిలిచింది. బాలయ్య, బన్నీ ఈ ఏడాది తమకి వచ్చిన గ్యాప్ ను ఫ్యాన్స్ వచ్చే ఏడాదితో మర్చిపోయేలా చేసే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి…