శాతకర్ణిలో లోపం…ఒప్పుకున్న బాలయ్య

184
Balakrishna about MISTAKES on satakarni Movie
- Advertisement -

భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. విమర్శకులతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటున్న శాతకర్ణి…బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాలయ్య కెరీర్‌లోనే రికార్డు వసూళ్లను సాధిస్తు టాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాలో యుద్ధాలు తప్ప…కథ పెద్దగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. శాతకర్ణి చేసిన యుద్ధాలు వరుస క్రమంలో చూపించారే తప్ప..ఆయన పాలన గురించి గానీ,వేరే కోణాల్ని గానీ సరిగా చూపించలేదని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై దర్శకుడు క్రిష్ స్పందించలేదు గానీ…బాలయ్య మాత్రం స్పందించాడు.

చిత్రంలో గొప్ప కథ లేదన్న విషయం నిజమేనని, అది లోపమే అయినప్పటికీ, ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేసి విజయవంతమయ్యామని అన్నారు. ఇలాంటి చారిత్రక నేపథ్యంతో మరో సినిమా చేయమని జనాలు అడుగుతున్నారు. సరైన స్ర్కిప్టు వస్తే తప్పకుండా చేస్తాన’ని చెప్పాడు బాలయ్య.

మరోవైపు గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, అప్పటి నుంచే తెలుగువారు ఉగాది పండుగను జరుపుకోవడం మొదలైందని ఈ చిత్రంలో చెప్పారు. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి వేరు, శాలివాహన శకం వేరు అని చెబుతున్నారు ఎనలిస్ట్‌లు. చరిత్రను అందంగా తెరకెక్కించేందుకు వాస్తవానికి కాల్పనికతను జోడించవచ్చునని, కానీ వాస్తవాన్ని వక్రీకరించేలా అభూత కల్పనలు ఉండరాదంటు చురకలు అంటిస్తున్నారు. అయితే, లోపాన్ని నిజాయితీగా ఒప్పుకున్న బాలయ్యకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందేనని అభిమానులు చెబుతున్నారు.

- Advertisement -