రష్మీ ఔట్‌…హంసానందిని ఇన్‌

239
Rashmi Out, Hamsa In For Kittugadu
- Advertisement -

రాజ్ తరుణ్‌ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. దానికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుట్టుంది.

Rashmi Out, Hamsa In For Kittugadu

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్‌ అట్రాక్షన్‌ కోసం ఓ ఐటెంసాంగ్‌ను చేర్చాలని నిర్ణయించిదట చిత్ర యూనిట్. ఈ ఐటెం సాంగ్‌ కోసం ముందుగా జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ రష్మీ ఫిక్స్‌ చేశారు… కానీ అంతలోనే మళ్లీ రష్మీకి గుడ్‌బై చెప్పి హంసా నందిని తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో హంసా నందిని మిర్చి, సోగ్గాడే చిన్నినాయన, అంతారింటికి దారేది ఐటెం సాంగ్‌లతో మెప్పించిన విషయం తెలిసిందే. కానీ రష్మీని ఐటెంసాంగ్‌ నుంచి సడెన్‌గా తప్పించాడనికి కారణాలు తెలియరాలేదు.

Rashmi Out, Hamsa In For Kittugadu

బుల్లితెరపై తెగ సందడి చేస్తున్న ఈ భామ వెండితెరపై రాణించాలన కోరిక మాత్రం తీరడంలేదు.‘గుంటూరు టాకీస్‌’ సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ ఆ మూవీ అనుకున్న రేంజ్‌లో ఆడకపోవడంతో పెద్ద ఆఫర్లను కూడా సొంతం చేసుకోలేకపోయింది. అయితే కనీసం స్పెషల్‌సాంగ్‌ ఆఫర్లైనా వస్తాయనుకుంటే అవి కూడా ఊరించి ఉసూరుమంటున్నాయి. రష్మీకి రెమ్యూనరేషన్ దగ్గర డీల్ సెట్ కాలేదని అందుకే అమెను తప్పించి హంసానందిని తీసుకున్నాట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి

ఈసినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన ‘మజ్ను’ చిత్రంతో పరిచయమైన నటి అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -