‘బలగం’ కలెక్షన్స్ ఎంతంటే?

266
- Advertisement -

ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మించిన ‘బలగం’ థియేటర్స్ లో మొదటి వారం పూర్తి చేసుకుంది. వారం రోజులకు గానూ సినిమా రెండు రాష్ట్రాలలో 7 కోట్ల గ్రాస్ అందుకుంది. మూడు కోట్లకు పైగా షేర్ రావడంతో చిన్న సినిమా సాదించిన పెద్ద విజయంగా బలగం చెప్పుకోవచ్చు.

మొదటి రోజు సినిమా మెల్లగా ఓపెన్ అయింది. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు, సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. వీకెండ్ లో అల్మోస్ట్ అన్ని ఏరియాల్లో యాబై శాతం పైనే ఆక్యుపెన్సీతో సినిమా మంచి వసూళ్లు అందుకుంది. రిలీజ్ కి ముందే వచ్చిన సూపర్ టాక్ తో సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

పబ్లిసిటీ అంతగా లేకపోయినా మౌత్ టాక్ తో సినిమా ఇంత వసూళ్లు చేయడం గొప్ప విషయమే. దిల్ రాజు ప్రొడక్షన్స్ బేనర్ పై హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి మొదటి కినేమగా నిర్మించిన బలగం దర్శక నిర్మాతలతో పాటు నటీ నటులకు కూడా మంచి గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది. తెలంగాణ సాంస్కృతి , సాంప్రదాయాలతో తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్స్ తో పాటు అవార్డులు కూడా దక్కడం ఖాయం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -