ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి..

159
bajireddy
- Advertisement -

ఆర్టీసీ ఛైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను నియమించారు సీఎం కేసీఆర్. ఇటీవలె సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించిన సీఎం…తాజాగా ఛైర్మన్‌గా బాజిరెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పటికే ఆర్టీసీని చక్కదిద్దే పనిలో నిమగ్నమైన సజ్జనార్‌…తన మార్క్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

చిమన్‌పల్లి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గోవర్దన్ రెడ్డి తర్వాత ఎంపీపీగా,ఏపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాజిరెడ్డి తర్వాత 2004,2014,2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisement -