ఈ ఆదివారం ట్యాంక్ బండ్‌పై ‘సండే – ఫ‌న్‌డే’ లేదు

36
Sunday-Friday

హైద‌రాబాద్ : ఈ ఆదివారం (సెప్టెంబ‌ర్ 19) ట్యాంక్‌బండ్‌పై ఫ‌న్‌డే ఉండ‌ద‌ని అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ త‌న ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఆదివారం రోజున ట్యాంక్‌బండ్‌పై గ‌ణేశ్ నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు హుస్సేన్ సాగ‌ర్, దాని ప‌రిస‌రాల్లో ట్రాఫిక్, ప్ర‌జా భ‌ద్ర‌త దృష్ట్యా ఫ‌న్‌డే నిర్వ‌హించ‌డం లేద‌న్నారు. గ‌త ఆదివారం ట్యాంక్‌బండ్‌పై లేజ‌ర్ షోతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను అల‌రించిన విష‌యం విదిత‌మే. గ‌త రెండు ఆదివారాల నుంచి సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌పై వాహ‌నాల‌ను అనుమతించ‌డం లేదు.