టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగా కిస్టల్ మౌంటెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరవింద్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు.ఈ సినిమాతో హర్షివ్ కార్తీక్ మెప్పించాడా లేదా చూద్దాం..
యా మార్టినోవా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బహుముఖం’. ఈ సినిమాని హర్షివ్ కార్తీక్ స్వయంగా నిర్మించి డైరెక్షన్ చేశాడు. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఫణి కళ్యాణ్ సంగీతం ఇచ్చాడు. బహుముఖం సినిమా మొత్తం అమెరికాలోనే షూట్ చేయడంతో అక్కడి కెమెరామెన్ ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఏప్రిల్ 5న రిలీజయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది.
కథ : తన్వీర్ వాళ్ళది అమెరికాలో స్థిరపడిన ఫ్యామిలీ. తన్వీర్ వాళ్ళ అమ్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ యాక్టర్ కాలేకపోతుంది. దీంతో తల్లి కలని తాను నిజం చేయాలని చిన్నప్పుడే ఫిక్స్ అవుతాడు తన్వీర్. అయితే అనుకోకుండా జైలుకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. బయటకి వచ్చాక నటుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన్వీర్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడతాయి. జైలు నుంచి బయటకు రావడంతో అతనికి ఓ కౌన్సిలర్ కూడా ఉంటుంది. ఓ సారి సైకో పాత్ర ఆడిషన్ ఇస్తే సరిగ్గా చేయలేదని విమర్శిస్తారు. దీంతో అతను ఎలాగైనా ఆ పాత్రని బాగా చేయాలని, మంచి నటుడు అవ్వాలని బాధపడుతూ, దానికోసం నిజమైన సైకోలా మారిపోయి హత్యలు చేస్తాడు. అసలు తన్వీర్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? తన్వీర్ ఎందుకు సైకోలా మారిపోయాడు? తన్వీర్ ఎందుకు హత్యలు చేశాడు? తన్వీర్ కి సైకో థెరపిస్ట్ ఎందుకు? అతను నటుడు అయ్యాడా? అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ : హర్షివ్ కార్తీక్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ మరో పక్క ఈ సినిమాని తీసాడు. ఈ సినిమాకి అతనే రచయిత, హీరో, దర్శకుడు, నిర్మాత కావడం విశేషం. ఇక ఈ బహుముఖం సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేశారు. దీంతో అక్కడ ఉన్న ఇండియన్స్, అమెరికా నటీనటులతో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడా కథ కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం బాగా రాసుకున్నారు. కానీ థ్రిల్లింగ్ సినిమాకి సరిపడా ట్విస్టులు మాత్రం లేవని అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ : ఈ సినిమా మెయిన్ లీడ్ అయినా హర్షివ్ కార్తీక్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఓ పక్క నటుడు అవ్వాలనే తపనతో, మరో పక్క సైకోగా అదరగొట్టాడు. స్వర్ణిమ సింగ్ హీరోయిన్ అని చెప్పినా కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపిస్తుంది. తనకి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్న పర్వాలేదనిపించింది. అమెరికన్ నటి మరియా మార్టినోవా మెప్పిస్తుంది. ఇక మిగిలిన నటీనటులంతా అమెరికాలో ఉండే వాళ్లనే తీసుకోవడంతో తెలిసిన స్టార్ కాస్ట్ ఎవరూ లేకపోయినా వాళ్లంతా తమ నటనతో ఓకే అనిపించారు.
సాంకేంతిక నిపుణులు పనితీరు: బహుముఖం సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది అని చెప్పొచ్చు. అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ల్యూక్ ఫ్లెచర్ విజువల్స్ చాలా బాగున్నాయి. కథకి తగ్గట్టు అమెరికాని బాగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడని తెలిసిందే. ఈ సినిమాకి కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. తల్లి కలని తీర్చడానికి కొడుకు ఏం చేశాడు అనే సింపుల్ కథ అయినా కొత్తగా చూపించడానికి హర్షివ్ కార్తీక్ ప్రయత్నించాడు. మొదటిసారి అని బాధ్యతలు తీసుకొని దర్శకుడిగా, నిర్మాణ విలువల పరంగా నిర్మాతగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
మొత్తంగా బహుముఖం సినిమా నటన అంటే పిచ్చి ఉన్న ఓ అబ్బాయి తల్లి కలని నిజం చేయడానికి నటుడిగా మారాలనుకునే క్రమంలో సైకోలా మారితే ఎలా ఉంటుంది అనే థ్రిల్లింగ్ అంశం తో తెరకెక్కించారు.
రేటింగ్ :3/5
Also Read:కాంగ్రెస్, బీజేపీ.. ‘మేనిఫెస్టో’లో గెలుపెవరిది?