బాహుబలి సినిమాతో భారతదేశాన్నే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.. దర్శకధీరుడు.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఇప్పుడు.. బాహుబలి 2 సినిమాకు ఆయన ఫాలో అవుతున్న స్ట్రాటజీతో.. మరోసారి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే బాహుబలి 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ట్రైలర్ తో యూ ట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. వంద లక్షల వ్యూస్‌తో భారతీయ సినిమా చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా రికార్డులను తిరగరాసింది.
బాహుబలి 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో సీక్వెల్ ట్రైలర్‌ని రిలీజ్ చేయగా ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి – 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ముంబై నుంచి కరణ్ జోహార్ వంటి ప్రముఖ చిత్ర నిర్మాత విచ్చేసిన ఈ కార్యక్రమంలో అయిదేళ్ల పాటు సాగిన బాహుబలితో తమ అనుబంధాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణులు పంచుకున్నారు. ఇక ఏప్రిల్ 28న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికంటే ముందే బాహుబలి ఫస్ట్ పార్ట్ ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
బాహుబలి పార్ట్ వన్ రిలీజై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఇప్పుడు పార్ట్ 2 కూడా రిలీజ్ కాబోతోంది. అయితే.. సినిమా చూసి చాలా రోజులైంది కాబట్టి.. ఇది మొదటి సినిమాకు కన్ క్లూజన్ గా వస్తోంది కాబట్టి.. బాహుబలి వన్ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నాడట. ఇప్పటికే పార్ట్ 2 పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.దీంతో ఏ మాత్రం వీలు కుదిరినా.. బాహుబలి వన్ ను థియేటర్లలో దించేందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడట.
మొదటి పార్ట్‌తో రూ. 600 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాడు రాజమౌళి. ఇక ఫస్ట్ పార్ట్ చూసిన వారిలో కనీసం 10 శాతమైనా మళ్లీ థియేటర్లలో బాహుబలి
వన్ ను చూస్తారు. సో.. మళ్లీ కలెక్షన్లు వస్తాయి. పైగా.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న క్యూరియాసిటీ జనాల్లో మరింత పెరుగుతుంది. ఇదే.. బాహుబలి 2కు మరింతగా మైలేజ్ తెచ్చిపెడుతుందని జక్కన్న భావిస్తున్నాడట.ఈ ముచ్చటంతా వింటున్న ట్రేడ్ అనలిస్టులు రాజమౌళిని
మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మొత్తంగా బాహుబలి పార్ట్ 1,2తో మరోసారి ట్రేడ్‌ని షేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు జక్కన్న.