బాహుబలి2 కోసం.. సంచలన నిర్ణయం..!

182
Bahubali 2 Film Shoking News
- Advertisement -

బాహుబలి2 సందడి త్వరలోనే మొదలు కాబోతుంది. మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తొలిపార్టు కంటే.. సాంకేతికంగా మరింత ఉన్నతంగా ఉండబోతుంది. ప్రధానంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయట. అయితే, సినిమా సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ.. మన థియేటర్లలో దానికి తగ్గ క్వాలిటీ ప్రొజెక్టర్లు ఉండటం కూడా ముఖ్యమేనని, అప్పుడే ప్రేక్షకుడు వంద శాతం ఆ అనుభూతిని పొందుతాడనే వాదన వినిపిస్తుంది.

Bahubali 2 Film Shoking News

అందుకే ఇప్పుడు దర్శక ధీరుడు ఆధ్వర్యంలో బాహుబలి నిర్మాతలు ఈ విషయంపై థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు జరిపారట. ఈ చర్చల్లో ఎలాగైతే 4కె రిజల్యూషన్ ఉన్న ప్రొజెక్టర్లను అమర్చుకునేలా థియేటర్ల యాజమాన్యాలను ఒప్పించారట. అయితే, ఒక్కో థియేటర్లో ఈ ప్రొజెక్టర్లను అమర్చుకోవడానికి ఏకంగా కోటి రూపాయల దాక ఖర్చవుతుందని తెలియడం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అయినా సరే ఇప్పుడు ఈ విషయంలో 200 థియేటర్ల యాజమాన్యాలు ముందుకు రావడం విశేషం. ఇలా ఇప్పటికే 4కె స్క్రీన్ అమర్చిన కొన్ని థియేటర్లకు భారీగా లాభాలు రావడం కూడా వారిని ముందుకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు ఇది ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని 4కె రిజల్యూషన్ ఉన్న ప్రొజెక్టర్లను అమర్చుకోవడానికే థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.అలాగే సినిమా రిలీజ్ కు ఇంకో మూడు నెలలు ఉండటంతో.. ఈ దిశగా మరిన్ని థియేటర్లు ముందుకు కదులుతాయని తెలుస్తోంది.

- Advertisement -