అవంతిక ట్రైలర్‌ రిలీజ్

90
AVANTHIKA movie Theatrical Trailer Launch

ప్రముఖ నిర్మాణ సంస్థ భీమవరం టాకీస్‌ బ్యానర్‌పై శ్రీరాజ్‌ బళ్ళ దర్శకత్వంలో శత చిత్రాలకు చేరువలో ఉన్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘అవంతిక’. ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ దర్శకరత్న దాసరి నారాయణరావు నివాసంలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా దర్శకరత్న మాట్లాడుతూ.. ‘తుమ్మలపల్లి రామసత్యనారాయణ నా ఇంటిలో మనిషి. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా నా ఆశీస్సులు తీసుకుంటాడు. సలహాలు అడుగుతుంటాడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా నా చేతుల మీదుగా జరిగింది. టీజర్‌ రిలీజ్‌కు తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్యగారు రావడం, ఆయన ఆశీర్వదించడం, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా నా సమక్షంలో చేయాలనుకోవడం నా మీదున్న గౌరవ భావానికి నిదర్శనం. దర్శకుడు శ్రీరాజ్‌ ఈ చిత్రం బాగా తీర్చిదిద్దారని ట్రైలర్‌ చూస్తుంటే అర్ధమవుతుంది. చిత్ర నిర్మాత రామసత్యనారాయణకు, చిత్ర యూనిట్‌కు అభినందనలు. ఈ చిత్రం విజయవంతం కావాలని, భీమవరం టాకీస్‌ వంద చిత్రాలు పూర్తి చేసి రికార్డు సాధించాలని, విజయవంతమైన చిత్ర నిర్మాణ సంస్థగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు.

AVANTHIKA movie Theatrical Trailer Launch

దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణగారు ట్రైలర్‌ రిలీజ్‌కు ఆహ్వానించినపుడు గురువుగారైన దాసరిగారి సమక్షంలో చేయమని కోరాను. ఆయన సమక్షంలో జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించాలి. ప్రముఖ నిర్మాతగా చిన్న బడ్జెట్‌లో సినిమాలు తీస్తూ వరుస విజయాలు సాధిస్తున్న రామసత్యనారాయణ మరిన్ని మంచి చిత్రాలు తీసి ఎన్నో విజయాలు సాధించాలి. ఎక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించి మరింత పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

AVANTHIKA movie Theatrical Trailer Launch

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘అవంతిక’ చిత్రం షూటింగ్‌ మా గురువుగారైన దాసరి చేతుల మీదుగా ఇక్కడే ప్రారంభించాము. సినిమా, టీజర్‌ను రోశయ్య గారి లాంటి ప్రముఖులు రిలీజ్‌ చేయడం, మరో అగ్రదర్శకుడు వి.వి.వినాయక్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం గురువుగారు బిగ్‌ సీడి రిలీజ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు శ్రీరాజ్‌ బళ్ళ ఇంతకుముందు రెండు చిత్రాలు చేశారు. ఈ సినిమాను పక్కా స్క్రిప్టుతో అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న అవుట్‌ పుట్‌ను రాబట్టారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కో మైలు రాయి అవుతుంది. ‘ట్రాఫిక్‌’ ఓపినింగ్‌ వి.వి.వినాయక్‌ చేయడం జరిగింది. ట్రాఫిక్ లాంటి మంచి సినిమా చేయడంతో నా మీద గౌరవం పెరిగిందని అపుడు వినాయక్ అన్నారు. ఆయన ఆలా అనడం వల్ల వచ్చిన స్ఫూర్తితోనే ఇన్ని సినిమాలు తీయగలిగాను. ఆ సినిమాతో మా సంస్థకు ఓ ప్రత్యేక మైలేజ్‌ ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రానికి కూడా ఆయనే ట్రైలర్‌ విడుదల చేయడం ఓ శుభసూచకంగా భావిస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకులు కె.ఆర్‌,ఫణిరాజ్‌, దర్శకుడు శ్రీరాజ్‌ బళ్ళ, ధీరజ అప్పాజీ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

పూర్ణ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కర్ణ, ఎడిటింగ్: సోమేష్, మాటలు: క్రాంతి, సైనా, సంగీతం: రవిరాజ్ బళ్ళ, రీ-రికార్డింగ్: ప్రద్యునన్, సమర్పణ: కె.ఆర్.ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీ రాజ్ బళ్ళ

AVANTHIKA movie Theatrical Trailer Launch