మళ్లీ యాడ్ లో నటించనున్న పవన్ ..!

80

పవన్, త్రివిక్రమ్ లు చాలా సందర్భాల్లో ఒకరికి అండగా ఒకరు నిలబడిన విధానం చాలా మందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే.. తాజాగా త్రివిక్రమ్ ను పవన్ ఓ సాయం అడిగినట్లు తెలుస్తుంది కాబట్టి. అది కూడా ఓ మంచి పని కోసం కావడం విశేషం. అసలు విషయంలోకి వెళితే, రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల దారుణ పరిస్థితులను తెలుసుకుని కరిగిపోయిన పవన్ కళ్యాణ్.. వాళ్ళ బాగు కోసం చేనేత ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసే ఉంటుంది.

Pawan Kalyan asks Trivikram for a crucial help

ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పవన్.. చేనేత ఉత్పత్తులకు వీలైనంత మంచిగా ప్రచారం కల్పించాలని డిసైడ్ అయ్యాడట. అందులో భాగంగా ఓ యాడ్ షూట్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసమే ఇప్పుడు త్రివిక్రమ్ ను ఓ కాన్సెప్ట్ రెడీ చేయమని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ ఆ ప్రకటన చేసే అవకాశం ఉందని ఇన్నర్ సర్కిల్ నుంచి సమాచారం రావడం హర్షించదగ్గ విషయం.

Pawan Kalyan asks Trivikram for a crucial help

ఇదిలా ఉంటే, పవన్ మామూలుగానే వాణిజ్య ఉత్పత్తుల ప్రచారానికి దూరంగా ఉంటాడనే విషయం తెలిసిందే. కొన్ని సంస్థలు కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా పవన్ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు నేతన్నల కోసం తనే స్వయంగా ఇలా ప్రచారం చేయడానికి పవన్ ముందుకు రావడం నిజంగా తన గొప్ప మనస్సును చాటుతుంది. అందుకే ఓ మంచి పని కోసం పవన్ చేయాలనుకుంటున్న ఈ ప్రయత్నానికి అప్పుడే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.