వినిపించి ఒప్పించడం కష్టమే.

14
- Advertisement -

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల టైమ్ బాగాలేదు. శ్రీకాంత్ అడ్డాలకి సెట్ మీద కన్నా వార్తల్లోనే ఎక్కువగా సినిమాలు వుంటున్నాయి. ఆ మధ్య నాగార్జున – పీవీపీ కలయికలో శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమా అనుకున్నాడు. కానీ అక్కడ సెట్ అవ్వలేదు. సంతృప్తికరమైన స్క్రిప్ట్ ఇవ్వలేకపోయాడని శ్రీకాంత్ అడ్డాల పై టాక్ నడిచింది. దాంతో పీవీపీ నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గింది. శ్రీకాంత్ అడ్డాల కూడా వెనక్కు వచ్చి యువి క్రియేషన్స్ లో కూర్చున్నాడు. ఇక్కడ హీరో రవితేజ తో సినిమా అనుకున్నాడు. ఈ సారి రవితేజ నుంచి అడ్డంకి. ఇక్కడా కుదరలేదు. మధ్యలో హీరో రామ్ కోసం శ్రీకాంత్ అడ్డాల బాగా ట్రై చేశాడు. ఇప్పటి వరకు రామ్ స్క్రిప్ట్ వినలేదు.. ఓకే అనలేదు.

అంతలో శ్రీకాంత్ అడ్డాల మనసు ధనుష్ వైపు మళ్ళింది. ఎలాగూ నారప్ప ఒరిజినల్ వెర్షన్ లో ధనుషే హీరో. దాంతో.. శ్రీకాంత్ అడ్డాల ధనుష్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. కానీ, వేరే సినిమాలతో ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవన్నీ అలా వుంచినా హీరో ధనుష్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా అడ్వాన్స్ లు వున్నాయని టాక్. పైగా అడ్వాన్స్ లన్నిటికి ఆల్ రెడీ డైరెక్టర్లు ఫిక్స్ అయ్యి ఉన్నారు. కాకపోతే, ఎప్పుడో జ‌మానా కాలం నాడు హీరో ధనుష్ లైకా ప్రొడక్షన్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. అందుకే, శ్రీకాంత్ అడ్డాల లైకా వైపు నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

కానీ లైకా ప్రొడక్షన్స్ కు సినిమా చేసే ఆలోచన ధనుష్ కు వుందా అన్నది అనుమానం. మొత్తం మీద హీరో ధనుష్ చేతిలో సినిమాలు దండిగా వున్నాయి. పైగా సెట్ మీదకు వెళ్లిన సినిమాల లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. మరి శ్రీకాంత్ అడ్డాల తన సబ్జెక్ట్ ను ధనుష్ కు వినిపించి, ఒప్పించి సినిమా స్టార్ట్ చేయడం కష్టమే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -