చేతిలో స్మార్ట్ ఫోన్ ఇదొక్కటి ఉంటే చాలు ఇంకేం లేకున్నా ఫర్వాలేదు. ఫైనల్ గా ఇది స్మార్ట్ ఫోన్ యుగం. అందుకే మనకు తెలియకుండానే రోజు గడిచిపోతుంది.
Also Read:PM Modi:టాప్ 3లో భారత్
నెట్ బ్రౌజింగ్, ఫ్రెండ్స్‌తో చాటింగ్, పాటలు వినడం, వీడియోలు చూడటం.. ఇలా బోలెడు టైం పాస్. చదువుకోవడానికి, ఆడుకోవడానికి కూడా చాలా మంది ఫోన్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇదంతా పైకి బాగానే కనిపిస్తుంది కానీ.. ఆ అలవాటు మోతాదు మించితేనే అసలుకు ఎసరొస్తుంది. అతి ఎక్కడైనా చేటే కదా. స్మార్ట్ ఫోన్ వాడకం కూడా ఇందుకు మినహాయింపేం కాదు.
ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపే వాళ్లు ఒత్తికి లోనయినట్లుగా, ఏదో ఆందోళన చుట్టుముట్టినట్లుగా ఫీలవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్ వాడకం పెరిగే కొద్దీ ఆత్రుత పెరుగుతున్నట్లు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ నాన్సీ చీవెర్ వెల్లడించారు.
ఫోన్ వాడుతున్న వారిలో ఆత్రుత పెరిగిపోతుంది. వాళ్లు తిరిగి ఫోన్‌ను చూసుకుంటే గానీ రిలీఫ్ అవ్వడం లేదని చీవెర్ తెలిపారు. ఆత్రుత కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతింటుందని ఆమె హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ గడిపే వారిలో మానసిక, శారీరక సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామన్నారు. సో తెలుసుకున్నారుగా స్మార్ట్ ఫోన్ తో కాస్త జాగ్రత్త మరి.