మందుబాబులకు షాకింగ్ న్యూస్. నిత్యం మందు సేవించే వారు కరోనా సోకితే కోలుకోవడం కష్టమని వైద్య నిపుణులు తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రెండోదశ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని….ఇక మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు అధికంగా ఉంటోందని వెల్లడైంది.
రెండోదశలో యువత, చిన్నారులు, గర్భిణులు సైతం దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. గర్భిణులు పాజిటివ్‌గా ఉంటే ప్రసవం తర్వాత, అప్పుడే పుట్టిన పిల్లలకు వైరస్ ఉన్నట్టు ఇంతవరకు తేలలేదన్నారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
మొదటి డోస్ తీసుకున్నాక రెండో డోస్ 4-8 వారాల్లో తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌తో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచించారు.