దీంతో చెడు కొలెస్ట్రాల్ మటుమాయం!

67
- Advertisement -

నేటి రోజుల్లో చాలమందికి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం ఒక సవాల్ గా మారింది. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరుగుతోంది. దీన్ని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆయాసం, ఉబుసం, ఊపిరితిత్తుల సమస్యలు. మలబద్దకం, వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు ఎన్నో రకాల మెడిసన్స్ వాడుతుంటారు చాలమంది. అయితే శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సహజసిద్దంగానే తగ్గించుకోవచ్చు అదెలాగో చూద్దాం !

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం ఎంతో అవసరం. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామ చర్యలు ప్రతిరోజూ చేస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతే కాకుండా రక్తనాళాల్లో వాపు, క్లానింగ్ వంటి సమస్యలు తగ్గి.. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆపిల్ పండులో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇందులోని మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది, ఇక బ్లాక్ బెర్రి పండ్లు కూడా కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలోని పీచు పెక్టిన్ రక్తంలోని కొలెస్ట్రాల్ ను పంపించి గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇంకా ద్రాక్ష, జమ వంటి ఫలాలు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. జామలోని విటమిన్ సి, నికోటిన్ ఆమ్లం కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇంకా బీన్స్, పుట్టగొడుగులు, వెల్లుల్లి వంటివి కూడా మనశరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అందువల్ల వేగంగా శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్న వాళ్ళు .. ప్రతిరోజూ ఆహార దినచర్యలో వీటిని చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 Also Read:గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..పక్కా హిట్ !

- Advertisement -