బచ్చలమల్లి..మూవీ రివ్యూ

3
- Advertisement -

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది బచ్చలమల్లి.

కథ:

బచ్చల మల్లి(అల్లరి నరేష్)కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. మల్లి టెన్త్ అయిపోయి కాలేజీ చదివే సమయంలో వాళ్ళ నాన్న(జై రామ్) వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం బయటపడటంతో అనుకోని పరిస్థితుల్లో అతని భార్యని(రోహిణి), మల్లిని వదిలేసి రెండో భార్య కోసం వెళ్ళిపోతాడు. దీంతో మల్లి తన నాన్న మీద పగ పెంచుకొని మూర్ఖంగా పెరుగుతాడు. సీన్ కట్ చేస్తే…ఇలాంటి మల్లి జీవితంలోకి కావేరి(అమృత అయ్యర్) రావడంతో అన్ని మానేసి మంచిగా మారిపోయి గోనెసంచుల వ్యాపారం నడిపిస్తాడు. అలాగే కావేరిని పెళ్లిచేసుకోవాలి అని అనుకుంటాడు…ఆ తర్వాత ఏం జరుగుతుంది?, మల్లి కావేరి ప్రేమకథ ఏమైంది? తండ్రి తప్పుని క్షమించాడా? మల్లి మాములు మనిషిగా మారాడా అన్నదే బచ్చలమల్లి కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు. అల్లరి నరేష్ ఈ పాత్రలో ప్రాణం పెట్టి చేశాడు. ఈ పాత్ర కోసం గడ్డం, జుట్టు బాగా పెంచేసి డీ గ్లామరైజ్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు. అమృత అయ్యర్ నటన సినిమా మరో ప్లస్. చాలా రోజుల తర్వాత హరితేజ మంచి పాత్రలో నటించింది. నరేష్ తల్లి పాత్రలో రోహిణి, నాన్న పాత్రలో జై రామ్ బాగా మెప్పించారు. మిగితా నటీనటుల్లో ప్రసాద్ బెహరా, అచ్యుత్ కుమార్, ఇనయా ఒదిగిపోయారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ బోరింగ్ సన్నివేశాలు. అతని నాన్న సన్నివేశాలతో కాస్త బోరింగ్ గానే సాగుతుంది. ఈ సినిమాలో మూర్ఖత్వం అనే పాయింట్ కి అవి అవసర్లేకపోయినా అంతా నరేష్ పాత్ర వాటితోనే నడిపించారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. పీరియాడిక్ సినిమా కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ అప్పటికి తగ్గట్టు చక్కగా చూపించారు. లొకేషన్స్ చాలా వరకు రియల్ లొకేషన్స్ వాడారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. కథ పరంగా సింపుల్ పాయింట్ అయినా ఒక మూర్ఖత్వం ఉన్న క్యారెక్టర్ మీద కథాంశాన్ని బాగా రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

తండ్రి మీద పగ అనే ఎమోషన్ తోనే చివరి వరకు కథ నడిపించారు. మల్లి – కావేరి ప్రేమ కథ చాలా బాగా పండింది. చనిపోయిన తర్వాత చివరి చూపు అనే అంశం మాత్రం రెండు చావులకు లింక్ చేస్తూ సీన్స్ బాగా తెరకెక్కించారు. మొత్తంగా మూర్ఖంగా మారిన ఓ వ్యక్తి, అతని జీవితంలో ఎదుర్కున్న సంఘటనల కథే బచ్చలమల్లి.

విడుదల తేదీ:20/12/2024
రేటింగ్:2.75/5
దర్శకత్వం – సుబ్బు మంగదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
సంగీతం- విశాల్ చంద్రశేఖర్

Also Read:కళా శ్రీనివాస్ దర్శకత్వంలో ‘డెక్కన్ సర్కార్’

- Advertisement -