మోడీకి కష్టకాలమే..రాందేవ్‌ విమర్శ

285
modi
- Advertisement -

ప‌ర్స‌న‌ల్ కేర్‌, ఆయుర్వేద న్యూట్రిష‌న్‌లాంటి ప్రోడ‌క్ట్స్‌లో ఇప్ప‌టికే యూనిలీవ‌ర్‌ లాంటి పెద్ద కంపెనీలను దెబ్బ‌కొట్టిన ప‌తంజ‌లి.. త‌న త‌ర్వాతి ల‌క్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. 2018 ఆర్థిక సంవత్సరంలో రెండింతలు పెంచుకుని 20వేల కోట్ల రూపాయలకు పైగా నమోదుచేయాలని కంపెనీ నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యోగా గురు రాందేవ్ బాబా.

చమురు ధరలను నియంత్రించకుంటే మోడీ వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చారించారు. తాను వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనని స్పష్టం చేశారు. పెట్రోల్,డీజీల్‌,నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

తనకు అవకాశమిస్తే లీటర్‌ పెట్రోల్,డీజీల్‌ను రూ. 35 నుంచి 40లకే విక్రయిస్తానని చెప్పారు. పెట్రోల్ ఉత్పత్తులను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. తాను జాతీయవాదినని 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినా ఇప్పుడు ఎవరికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని చెప్పారు.

మోడీని విమర్శించడం ప్రజల ప్రాథమిక హక్కని…రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఉద్యోగాలు లేక యువత సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.భారత్‌పై లైంగికదాడుల రాజధానిగా ముద్రపడటం సిగ్గుచేటని చెప్పారు.

- Advertisement -