కుంభమేళా అంటే మనకు గుర్తొచ్చేది యూపీ. గంగా,యమునా,సరస్వతి నదులు సంగమంగా ప్రసిద్దిగాంచిన కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన సంగతి తెలిసిందే. కుంభమేళాకు ముందుగా మినీ కుంభమేళా జరుగుతుంది. సంక్రాంతి సమయంలో జరిగే మాఘ్ మేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మేళా సమయంలో పవిత్ర జలాలతో స్నానం చేస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం.
ఇక కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలచేది నాగ సాధువులు,దిగంబరులు. కుంభమేళాకు దేశ వ్యాప్తంగా ఉండే సాధువులంతా వస్తారు. మేళా జరిగే అన్ని రోజులు అక్కడే ఉండి ద్యానం, నదీయోగ వంటి కార్యక్రమాలు చేస్తారు. కుంభమేళా సందర్భంలో మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న నాగసాధువులందరూ కలుస్తుంటారు. మిగిలిన సమయాల్లో తాము నివాసం ఉండే ప్రదేశాలకే పరిమితమవుతుంటారు.
ఈసారి కుంభమేళాలో ఓ సాధువు చేసిన సాహసం హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్టర్ ను ఓ తాడు సాయంతో తన మర్మాంగానికి కట్టుకుని ఓ సాధువు ముందుకు లాగారు. తెల్ల జుట్టు, గడ్డంతో బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి నగ్నంగా ఉన్న ఆ సాధువు తన ఆధ్యాత్మిక శక్తిని నిరూపించడానికి అసాధారణ ప్రదర్శనను ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.