‘నా నువ్వే ‘అంటున్న కళ్యాణ్ రామ్..

186
Kalyan Ram,Tamannah 'Naa Nuvve' Movie Teaser
- Advertisement -

నందమూరి కల్యాణ్ రామ్ ఒక వైపున నిర్మాతగా రాణిస్తూనే మరో వైపున హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన జయేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ జరుపుకుంది. డిఫరెంట్ కంటెంట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి తాజాగా ‘నా నువ్వే’ అనే టైటిల్ టీజర్‌ను వదిలారు. మోర్ లవ్ .. మోర్ మేజిక్ అనేది ట్యాగ్ లైన్ ను గా ఉంచారు.

Kalyan Ram,Tamannah 'Naa Nuvve' Movie Teaser

కల్యాణ్ రామ్ కి ఇది 15వ సినిమా .. ఈ సినిమాలో ఆయన క్లీన్ షేవ్ తో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా .. ‘లవ్ 100’ ఎఫ్ ఎమ్ ఆర్జే గా తమన్నా అలరించనుంది. చాలా గ్యాప్ తరువాత తమన్నా నుంచి వస్తోన్న సినిమా కావడం, తొలిసారిగా ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఫస్టులుక్ ను ఆ తరువాత టీజర్ ను వదిలే ఆలోచనలో వున్నారు.

అంతే కాకుండా కల్యాణ్‌రామ్‌ ‘ఎంఎల్‌ఏ’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. మరోపక్క తమన్నా ‘క్వీన్‌’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ నటించిన ‘క్వీన్‌’కు ఇది రీమేక్‌గా రాబోతోంది. విక్రమ్‌కి జోడీగా ‘స్కెచ్‌’ సినిమాతోనూ తమన్నా బిజీగా ఉన్నారు. నా నువ్వే సినిమాను వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -