అజ్ఞాతవాసి పాట.. అనసూయ ఆట..!

251
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం అజ్ఞాత‌వాసి. జ‌నవ‌రి 10న విడుద‌ల కానున్న ఈ చిత్ర ఆడియోని రీసెంట్‌గా విడుద‌ల చేశారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ అందించిన పాట‌లు ప్ర‌తి ఒక్కరిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. శ్రోత‌లు కొన్ని పాట‌ల‌ని అదే ప‌నిగా వింటూ ఆనందిస్తుంటే , నెటిజ‌న్స్ కొంద‌రు డ‌బ్ స్మాష్‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లోకి అందాల భామ అన‌సూయ కూడా చేరింది.

Anasuya Dubsmash on Agnyathavasi Song

యాంక‌ర్‌గా, న‌టిగా రాణిస్తున్న అన‌సూయ తాజాగా ‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని ‘బయటకొచ్చి చూస్తే.. టైమేమో 3’0 క్లాక్‌’ అనే పాటకు డబ్‌స్మాష్‌ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అన‌సూయ ఎక్స్‌ప్రెష‌న్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కూడా అయింది. ఈ పాటకు అనుగుణంగా అనసూయ తన హావభావాలను పలికిస్తూ ఆకట్టుకుంది. ఈ పాటలో ‘నీ చేతికున్న బ్యాంగిల్సే..’ అనే చరణానికి తన చేతి గాజులను ఊపుతూ, ‘కార్నర్ లో కాఫీ షాపు..’ అనే వాక్యానికి తన చేతిలో కాఫీ కప్పుతో హావ భావాలు పలికించింది.

- Advertisement -