బగేశ్వర్ ధామ్ పీఠాధీశ్వర ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి 10 రోజుల పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగనుంది. 145 కిలోమీటర్ల ఈ పాదయాత్ర హిందూ ఐక్యతను పెంపొందించడం, కుల వివక్షను నిర్మూలించడం, శాంతి, జాతీయత మరియు సనాతన విలువలను ప్రచారం చేయడమే లక్ష్యంగా కలిగి ఉంది. యాత్ర న వంబర్ 16 వరకు కొనసాగుతుంది.
ప్రారంభ సభలో మాట్లాడుతూ శాస్త్రి మాట్లాడుతూ.. ఇది మా జీవితంలో రెండవ పాదయాత్ర. హిందువులలో మేల్కొలుపు రావాలి. కులవివక్ష, తారతమ్య భావాలు అంతరించాలి. ఈ దేశంలో కులవివక్ష కాదు, జాతీయత కావాలి. మన హిందూ పిల్లలు, మీ పిల్లలు సురక్షితంగా ఉండాలి. దేశం ఇస్లామీకరణ దిశగా పోకూడదు. అల్లర్లు లేకుండా, గంగా శాంతి సువాసనలా వ్యాపించాలి. అందుకే ఈ పాదయాత్ర చేపడుతున్నాం అన్నారు.
దేశం అందరిదీ… ఈ పాదయాత్ర హిందువులు ఉన్న ప్రతి పార్టీకి చెందినది. కుల వివక్ష తొలిగితే హిందువులు ఐక్యంగా ఉంటారు.. దేశంలోని పలు ప్రాంతాల నుండి సుమారు 40,000 మంది ఈ పాదయాత్రలో పాల్గొనడానికి నమోదు చేసుకున్నారు. ప్రతిరోజూ కార్యక్రమం జాతీయ గీతం మరియు హనుమాన్ చాలీసాతో ప్రారంభమవుతుంది. తర్వాత ఏడు ప్రతిజ్ఞలు చేయబడతాయి — ఇవి హిందూ ఐక్యతను పెంపొందించడం, కులవివక్షను నిర్మూలించడం లక్ష్యంగా ఉంటాయి అని శాస్త్రి స్పష్టం చేశారు.
Also Read:ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ ఆగ్రహం

