ఇప్పుడు ప్రపంచం మొత్త్తం బాహుబలి వైపుచూస్తోంది. ఒక తెలుగు సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందంటే దానికి కారణం రాజమౌళి. ఎందుకంటే ఆయన తీసిన బాహుబలి సినిమా ఎంతటి సంచలనాల్ని సృష్టించిందో తెలిసిందే. అందుకే ఇప్పుడు బాహుబలి2 సినిమాకి అంత క్రేజ్. ఫస్ట్ సినిమా నుంచి విజయ పరంపరలో దూసుకుపోతున్న జక్కన్నను చూసి తెలుగు సిని పరిశ్రమ గర్విస్తోంది. జక్కన్న బాహుబలి సినిమాను మొదలుపెట్టినప్పటినుంచి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇక రకంగా చెప్పాలంటే..జక్కన్న కష్టం చరిత్రలో తెలుగు సినీచరిత్రలో నిలిచిపోతాడని చెప్పక తప్పదు.
అయితే నిన్న(ఆదివారం) రామోజీ ఫిల్మ్ సిటిలో జరిగిన బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఆయన మనసులోని మాటని బయటపెట్టాడు. ఆయన కమర్షియల్ సినిమాలు చేస్తూ… ఎప్పటికప్పుడు హీరోయిజం ఎలా ఉండాలలో ఊహించుకుంటూ అలాగే సినిమాలు చేసేవాడని ఈవెంట్లో చెప్పాడు రాజమౌళి.
బాహుబలి ది కన్ క్లూజన్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో తన సిమాకు సహకరించిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. అయితే..ఇన్నేళ్ళు సమయం ఇచ్చిన ప్రభాస్ కు తాను ఏం ఇచ్చాను అని ఆలోచించేవాడని చెప్పుకొచ్చారు జక్కన్న. అయితే బాంబేలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రభాస్ ఎంట్రీతో మీడియా ప్రతినిధులే పెద్దగా అరిచారని… అది చాలనిపించిందన్నారు రాజమౌళి.
ఇంకా బాహుబలిలో ఎన్నో అద్భుతాలు చేశారని అన్నారు. అంతేకాకుండా..రెబల్‌స్టార్ ప్రభాస్ ఆయనకు స్పెషల్ అని పేర్కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని..కానీ సమయం లేనందున ఆయన ప్రసంగాన్ని తొందరగానే ముగిస్తున్నట్లు తెలిపారు. ఇక బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియాలంటే..ఏప్రిల్ 28 వరకి ఆగాల్సిందేనన్నారు రాజమౌళి.