స్టూడెంట్స్ మెస్ ఛార్జీలు పెంపు

226
CM Kcr speech on Assembly
- Advertisement -

తెలంగాణ ఆర్ధికంగా పరిపుష్టిగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దవ్యవినిమయ  బిల్లుపై మాట్లాడిన సీఎం అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం అప్పులు చేస్తోందంటూ ప్ర‌తిప‌క్ష స‌భ్యులు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఆ విమ‌ర్శ‌లు స‌రికావ‌ని సూచించారు. ఎక‌నామిక్స్‌లో ట్రెండ్స్ మారిపోయాయని, ప్ర‌పంచం ఎటు వెళుతుందో మ‌న‌మూ అటు వైపే వెళ్లాలని అన్నారు.

సంక్షేమ రంగంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని ఉద్ఘాటించారు. వసతి గృహాల విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించారు. 3వ తరగతి నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 950కి పెంపు, 8 నుంచి పదో తరగతి వరకు రూ. 1100కు పెంపు, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ. 1400కు పెంచారు. మెస్ ఛార్జీల పెంపుతో 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. హోంగార్డులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. ఆశా వర్కర్లకు కూడా త్వరలోనే వేతనాలు పెంచుతామని తెలిపారు.

ఒంటరి మహిళలకు జీవన భృతి కల్పిస్తున్నాం. వసతి గృహాల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. గత 60 ఏళ్ల కాలంలో బీడీ కార్మికులను ఎవరైనా గుర్తించారా? అని ప్రశ్నించారు. తాము 3.7 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రూ. 1000 చొప్పున పింఛన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వారి వివాహాలకు రూ. 75 వేల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగుందని నిర్ధారణకు వచ్చాకే డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రకటన చేశామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేస్తామన్నారు.

ప్ర‌ప‌ంచంలో అత్య‌ధిక ధ‌నిక దేశం అమెరికా అని, అత్యధిక అప్పులు కూడా ఆ దేశానికే ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారు మ‌న‌క‌న్నా తెలివిఎక్కువ వారే కానీ, తెలివి త‌క్కువ వారు కాదు అని అన్నారు. అప్పులు తెచ్చుకునే వీలు ఉంటే తెచ్చుకోవ‌చ్చ‌ని అన్నారు. అప్పులు తెచ్చి వాటిని ఖ‌ర్చు పెట్ట‌క‌పోతేనే త‌ప్ప‌వుతుందని చెప్పారు. అప్పులు తీసుకోవ‌డ‌మే కాదు.. మ‌ళ్లీ తిరిగి తీరుస్తూనే ఉంటామ‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల‌ను త్వ‌ర‌లో రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని కేసీఆర్ అన్నారు. తాము మెస్ చార్జీల‌ను పెంచుతున్నామ‌ని, దానితో 18లక్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని అన్నారు. తాము అధికారంలోకి రాగానే విద్యుత్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు తీవ్రంగా శ్ర‌మించి, ఆ కొర‌త‌ను తీర్చామ‌ని చెప్పారు. తెలంగాణ‌లో డిమాండ్‌కు త‌గ్గ‌ట్లు విద్యుత్ స‌ర‌ఫ‌రా కొన‌సాగిస్తున్నామ‌ని అన్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక ప్రగతి బాగుండడంతోనే రెండు పడక గదుల నిర్మాణం చేపట్టామని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయబోమని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని, సుప్రీంకోర్టును కోరుతామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ పెరగాల్సి ఉందన్నారు. బీసీల రిజర్వేషన్లపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లను ప్రతిపాదించడం లేదన్నారు.

- Advertisement -