మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులను విస్మరించింది- వినోద్‌

168
b vinod
- Advertisement -

టీఆర్‌స్‌ పార్టీలోకి చేరికలు కోనసాగుతూనే ఉన్నాయి. నేడు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది కల్యాణ్‌రావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ రాష్ర్ట‌ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బి. వినోద్‌ కుమార్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాధర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్‌ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న నగరంలో మత విద్వేశాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారన్నారు. రైతులు, కార్మికులే నిజమైన దేశభక్తులు అన్నారు. మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులను విస్మరించిందన్నారు.

మోదీకి విశాల ఛాతి ఉంది.. కానీ విశాల హృదయం లేదన్నారు. జియో కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.ఎల్‌ఐసీతో పోటీపడే శక్తి ప్రపంచంలో ఏ సంస్థకు లేదని.. ఎల్‌ఐసీని అమ్మడం కూడా దేశభక్తేనా అని వినోద్‌ కుమార్‌ బీజేపీని ప్రశ్నించారు. ఎల్‌ఐసీలో మెజార్టీ వాటాను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారన్నారు మండిపడ్డారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం న్యాయవాదులు కృషిచేయాలని వినోద్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -