మహేష్‌ ‘సర్కారు వారి పాట’కు సితార క్లాప్..

29
Sarkaru Vaari Paata

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకుడు పరశురాం కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు నేడు హైదరాబాదులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహేష్‌ బాబు ముద్దుల తనయ సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రతా కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ‘సర్కారు వారి పాట’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2021 జనవరి మొదటి వారం నుంచి జరగనుంది. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు 14 రీల్స్, మహేష్‌ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్ స‌ర్కారు వారి పాట చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. స‌ర్కారు వారి పాట చిత్రం ప‌ర‌శురాంకు మోస్ట్ ఎక్జైటెడ్ వెంచ‌ర్ అని పూరీ ట్వీట్ చేశాడు. ఈ చిత్రం మ‌హేశ్ బాబు అభిమానుల అంచ‌నాలకు ఏ మాత్రం త‌గ్గకుండా ఉంటుంద‌న్నాడు. మ‌హేశ్ ఫ్యాన్స్ పండ‌గే అని అని ట్వీట్ లో పేర్కొన్నాడు. నేను ముంబైలో ఉండ‌టం వల్ల పూజా కార్య‌క్ర‌మానికి రాలేక‌పోయాను. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశాడు.