క్రిస్టియన్ల సమస్యల పరిష్కారంపై సీఎం కెసిఆర్ చిత్తశుద్ధితో ఉన్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ ఏం చెప్పారో అన్ని వర్గాల సంక్షేమం కోసం అదే చేస్తున్నారు అని వినోద్ కుమార్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌజ్ లో క్రిస్టియన్ మతపెద్దలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్,కొప్పుల ఈశ్వర్ ,రాష్ట్ర ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ బి వినోద్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ,సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బి .వినోద్ కుమార్ మాట్లాడుతూ… సీఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. పట్టణం,పల్లె అనే తేడా లేకుండా అంతటా అభివృద్ధి కనిపిస్తోంది అన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచమంతా ఆర్ధిక రంగంలో మందగమనం నెలకొంది. ఈ కోవిడ్ లోనూ రాష్ట్రంలో అభివృద్ది,సంక్షేమం ఆగలేదు. వంద దేశాల కన్నా జనాభాలో హైదరాబాద్ పెద్దగా ఉంటుంది. కోవిడ్ పరిసితుల్లోనూ హైదరాబాద్‌లో వినూత్న అభివృద్ధి పనులు కొనసాగడానికి మంత్రి కేటీఆర్ ఆలోచనా విధానమే కారణం అని వినోద్ తెలిపారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని వినోద్ పేర్కొన్నారు.