ద రైజ్ ఆఫ్ ‘మోస‌గాళ్లు’…ఆవిష్క‌రించిన వెంక‌టేష్‌

166
venkatesh

‘విక్ట‌రీ’ వెంక‌టేష్ శుక్ర‌వారం ద రైజ్ ఆఫ్ ‘మోస‌గాళ్లు’ (సినిమా టైటిల్ థీమ్ మ్యూజిక్)ను ఆవిష్క‌రించారు.భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ క్రాస్ఓవ‌ర్ ఫిల్మ్‌ను నిర్మాత‌లు విల‌క్ష‌ణంగా, విస్తృతంగా ప్ర‌మోట్ చేస్తున్నారు.

థీమ్ మ్యూజిక్ ఉత్తేజ‌భ‌రితంగా ఉండి, కుర్చీలలో మునివేళ్ల‌పై కూర్చొని చూసే థ్రిల్ల‌ర్‌గా సినిమా ఉంటుంద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది.100 అమెరిక‌న్ డాల‌ర్ల నోట్‌ను ఉప‌యోగించి డిజైన్ చేసిన టైటిల్‌ ద రైజ్ ‘మోస‌గాళ్లు’లో ఆవిష్కృత‌మైంది. మొత్తంగా, ఇది సూప‌ర్బ్‌గా, స‌మ్మోహ‌న‌భ‌రితంగా ఉంద‌ని చెప్పాలి.

విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఈ చిత్రంలోని విశేషం.భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్లు’ చిత్రం రూపొందుతోంది.బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

తారాగ‌ణం:
విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రుహీ సింగ్‌

సాంకేతిక బృందం:
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.
నిర్మాత‌: విష్ణు మంచు
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌