- Advertisement -
యోగాతో కరోనాకు చెక్ పెట్టవచ్చని కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. కొవిడ్ అనంతర ఇబ్బందులను పరిష్కరించడంలో ఆయుర్వేదం,యోగాతో పాటు ఇతర వ్యవస్థలు ప్రపంచానికి ఎంతో సహాయపడుతాయని వెల్లడించారు.
పోస్ట్ కొవిడ్ ఇబ్బందులను పరిష్కరించడంలో ఆయుర్వేదం, యోగా ప్రపంచానికి ఎంతో సహాయపడుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నారు.మహమ్మారి తర్వాత తలెత్తే మానసిక, ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి కూడా ఇవి పరిష్కారం చూపుతాయన్నారు.
భవిష్యత్‌లో ఎలాంటి సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నివారణ చర్యలపై ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కొత్త ఆరోగ్య సంరక్షణ అవసరమని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
- Advertisement -