200కిపైగా తుపాకులకు ఆయుధ పూజ

6
- Advertisement -

200కిపైగా తుపాకులకు ఆయుధ పూజ చేశారు ఓ ఎమ్మెల్యే. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా కుండా నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా భయ్యా(రఘురాజ్ ప్రతాప్ సింగ్).

అయితే దసరా సందర్భంగా ఆయుధ పూజ చేయగా రాజా భయ్యా వద్ద లెక్క లేనన్ని ఆయుధాలు ఉన్నాయి. తన భర్త వద్ద పెద్దఎత్తున ఆయుధాలు ఉన్నాయని ఆరోపిస్తూ సెప్టెంబర్ 18న పీఎంఓకి లేఖ రాశారు రాజా భయ్యా భార్య భన్వీసింగ్.

విజయదశమి రోజున 200కిపైగా ఆయుధాలకు పూజ చేశారు ఎమ్మెల్యే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Also Read:విజయ్ రాజకీయ నాయకుడు కాదు..నటుడే!

- Advertisement -