Ram Temple:ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత..

17
- Advertisement -

అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు సత్యేంద్ర దాస్‌. ఆయన అంత్యక్రియలు అయోధ్యలోని సరయూ నది తీరంలో నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 3న ఆయనకు గుండెపోటు రావడంతో న్యూరాలజీ వార్డ్‌లోని హెచ్డీయూలో (హై డిపెండెన్సీ యూనిట్) చేర్చారు. దీనికి తోడు షుగర్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఆచార్య దాస్ తన 20వ ఏటనే ప్రధాన పూజారిగా నియమితులయ్యారు. ఆయన భౌతికకాయాన్ని లక్నో నుండి అయోధ్యకు తరలించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్…ఆచార్య దాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Also Read:TTD:కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -