TTD:కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

22
- Advertisement -

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ
18-02-2025
ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం)

రాత్రి – పెద్దశేష వాహనం

19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

20-02-2025
ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

Also Read:హోంగార్డులకు జీతాలేవి?: హరీశ్‌ రావు

22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

23-02-2025
ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

25-02-2025
ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

26-02-2025
ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

- Advertisement -