అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు…

49
ayodhya airport

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను యోగి సర్కార్‌ ఆమోదించింది. మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ విమానాశ్రయంగా నామకరణం చేశారు.

అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని, యూపీలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా ఉండవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ 2018 నవంబర్‌లో దీపావళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోగా అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.