ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు..

163
aravind
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత,ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యానించారని టీఆర్ఎస్‌ నేతలు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఆయనపై ఐపీసీ 504, 506, 427 సెక్షన్ల కింద నమోదుచేశారు.

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉండే పబ్లిక్‌ ప్లేస్‌లలో అడ్వైర్టెజ్‌మెంట్‌ బోర్డులు ఉన్నాయి. వాటిని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అద్దెకు తీసుకున్నది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన హోర్డింగులను, ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. వాటిని ధ్వంసం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సంజయ్‌. ఆయన సమక్షంలోనే కేబీఆర్‌ పార్కు సమీపంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీని చించేశారు.

ఈ ఘటనపై టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌తోపాటు న్యాయవాదులు కల్యాణ్‌రావు, లలితారెడ్డి, చంద్రశేఖర్‌రావు, మల్లేశ్‌ తదితరులు..ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలను చించడంతోపాటు నగరంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పాలన్న దురుద్దేశంతో ఈ పని చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -