పంది మాంసం తింటా..వైన్‌ తాగుతా:రష్మికా

106
upasana

తాను పంది మాంసం తింటానని మొహమాటం లేకుండా చెప్పారు సినీ నటి రష్మీకా. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన స్టార్ట్ చేసిన యుఆర్ లైప్‌ అనే వెబ్‌సైట్‌లో సెలబ్రెటీలతో వంటలు చేయిస్తోంది. ఈ నేపథ్యంలో రీచార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక పేరుతో ర‌ష్మిక‌తో ప‌లు వంటలు వండించింది ఉపాసన .

కోలీ పుట్టు(కోడి) కూరతో ర‌ష్మిక వండిన వంట‌న ఉపాస‌న‌ని ఎంత‌గానో ఇంప్రెస్ చేసింది. అయితే కోలీ పేరు విన్న ఉపాస‌న మీరు కోడవ(కోర్గి) సామాజిక వ‌ర్గానికి చెందిన వారా అని అడుగగా అవునని తెలిపింది రష్మికా. మీరు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా? అని అడగగా అవునని సమాధానం తెలిపింది. మేం ఇంట్లోనే వైన్ చేసుకుంటాం, పంది మాంసం తింటాం….కాల్చుకొని తింటే చాలా బాగుంటుందని తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చింది.