Hyderabad:నార్కోటిక్స్‌పై అవగాహన ముఖ్యం

37
- Advertisement -

తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో సీవీ ఆనంద్ అధ్యక్షతన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటులు నిఖిల్‌ సిద్ధార్థ్‌ మరియు ప్రియదర్శిని రామ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సీవీ ఆనంద్, భారతి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కమిషనర్ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ… నార్కోటిక్ వింగ్స్ పోలీసులకు నా సెల్యూట్‌. దేశవ్యాప్తంగా 11కోట్ల 50లక్షల మంది డ్రగ్‌ తీసుకున్నట్టు నేషనల్‌ నార్కోటిక్ డ్రాగ్ బ్యూరో అంచనా వేసింది. మనదేశంలోకి ఎక్కువగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి డ్రగ్స్‌ అక్రమ పద్దతులల్లో వస్తుందని వాటిని నిరోధించడానికి పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నదని అన్నారు. రానున్న రోజుల్లో యువతను ఈ మాదకద్రవ్యాల బాట పట్టకుండ ఉండటానికే ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ పరివర్తన ద్వారా అవగాహన కల్పించి మాదకద్రవ్యాల గురించి అవగాహన తెలిపేవిధంగా కృషి చేయాలన్నారు. ప్రజలల్లో పరివర్తన కల్పించి వారిని డ్రగ్స్ వాడకం మానేల చేయడం మాలక్ష్యమని పేర్కొన్నారు.

హీరో నిఖిల్‌ మాట్లాడుతూ…తనని చాలా సార్లు డ్రగ్స్ తీసుకోమ్మని బలవంతం చేశారని అన్నారు. కానీ వాటికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో భవిష్యత్‌ ఉందని దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అన్నారు. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దని కోరారు. త్వరలోనే మాదకద్రవ్యాల రహిత తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read: షర్మిల..” నో క్లారిటీ ” ?

నటుడు ప్రియదర్శి రామ్ మాట్లాడుతూ..10యేళ్ల క్రితం నేను సిగరెట్‌ తాగాను. దానికి బానిస కావొద్దు అనుకొని అతికొద్ది కాలంలో సిగరెట్‌కు దూరంగా ఉన్నా అని తెలిపారు. ఇప్పుడు నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉన్నట్టు తెలిపారు. డ్రగ్స్‌ వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవెర్‌నెస్ తీసుకురావచ్చని తెలిపారు. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

Also Read: TSPSC:గ్రూప్‌-4 హాల్‌టికెట్లు విడుదల…

- Advertisement -