TSPSC:గ్రూప్‌-4 హాల్‌టికెట్లు విడుదల…

37
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్‌-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. వచ్చే నెల 1న గ్రూప్-4 పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. జూలై 1వ తేదీన ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ అధికారులు సూచించారు.

Also Read: షర్మిల..” నో క్లారిటీ ” ?

- Advertisement -