ప్లాస్టిక్ ని నియంత్రిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం… పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆవరణలో ప్లాస్టిక్ ని నిషేధించి జూట్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ వాడాలని అవగాహన సదస్సు నిర్వహించారు మల్యాల CI కోటేశ్వర్.
ప్లాస్టిక్ కి బదులు అందరు జూట్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ వాడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జూట్ బ్యాగ్స్ ని పంచి అందరిలో ఒక అవగాహనని కల్పించే దిశగా పని చేస్తున్నారు అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్లాస్టిక్ ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరము అన్నారు.ఇంతటి గొప్ప కార్యక్రమాలలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో SI అశోక్, కొండగట్టు గుడి EO వెంకటేష్, AEO శ్రీనివాస్,గుడి సూపర్డెంటెంట్ సునీల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంచార్జ్ గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:వేపరసం తాగడం వల్ల ఎన్ని లాభాలో..?