పూరి.. ఎప్పటికీ ఒక బ్రాండే

26
- Advertisement -

పూరి జగన్నాధ్.. అలియాస్ పూరి.. ఏం చెప్పాలి ఈ డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడి గురించి. ఎంత అని చెప్పాలి ?, ఒక్క మాటలో ఆయన నేటి మోడరన్ ఋషి. ఆయన గాడ్ ఆఫ్ పంచెస్.. ఆయన ఐడియాలజీలో లెజెండ్. అందుకే.. పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ ఒక బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో తొలి హిట్ అందుకున్న పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు, ఇస్మార్ట్ శంకర్ లాంటి ఎన్నో భారీ హిట్స్ ఇచ్చారు. ఈరోజు పూరీ బర్త్ డే. సహజంగానే పుట్టినరోజులు పూరికి ఇష్టం ఉండవు.

కానీ, పూరి మాత్రం ఎప్పటికీ ప్రేరణే. పూరీ జగన్నాథ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డారు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా హిట్ అందుకోవడం ఆయన స్టైల్. జీరో అయ్యాడని అనుకున్న ప్రతిసారీ భారీ హిట్ అందుకుంటారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. లైగర్ తర్వాత మళ్లీ పూర్తిగా పడిపోయాడు. కానీ లేవడం పూరికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే, ఈ రోజు పూరి జగన్నాథ్ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్‌‌లో రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరీ జగన్నాథ్ ఉన్నారు. మొత్తమ్మీద డబుల్ ఇస్మార్ట్ మూవీ పోస్టర్ బాగానే ఆకట్టుకుంది. పోస్టర్ లో ఉన్న జోష్ సినిమాలో కూడా ఉంటుందని పూరి చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో పూరి క్రేజ్ అండ్ ఇమేజ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు అయ్యింది. పోస్టర్ లో సంజయ్ దత్ ను చూస్తే ఈ సినిమాలో ఆయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని అర్ధం అవుతుంది.

- Advertisement -