అవినాష్ రెడ్డి.. నో అరెస్ట్ !

35
- Advertisement -

ఏపీలో గత ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే వివేకా హత్య జరిగి ఇప్పటికి నాలుగేళ్ళు పూర్తి అయినప్పటికి ఈ కేసులో దొషులెవరో ఇప్పటికీ సస్పెన్స్ గానే మారింది. ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు ఫైనల్ గా వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో రెండు సార్లు విచారణను ఎదుర్కొన్నా అవినాష్ రెడ్డిను నేడు ( మార్చి 11న ) మూడవ సారి కూడా తెలంగాణ సిబిఐ విచారించింది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన విచారణలో కీలక విషయాలను సిబిఐ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న ( మార్చి 10 న ) ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనను సిబిఐ టార్గెట్ చేస్తోందని, విచారణ ఏకపక్షంగా జరుగుతుందని, దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ అవినాష్ రెడ్డి హైకోర్టు లో పిటిషన్ వేశారు. అంతే కాకుండా నేడు ( 11న ) జరిగే విచారణను న్యాయవాది సమక్షంలోనూ, ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ విచారణ కొనసాగించలని అవినాష్ రెడ్డి పిటిషన్ లో కోరారు. ఇక ఈ పిటిషన్ పై నేడు విచారించిన హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయరాదని ఆదేశించింది. ఇప్పటివరకు విచారణలో సేకరించిన సమాచారాన్ని దర్మసనానికి సమర్పించాలని హైకోర్టు తెలిపింది.

దీంతో సోమవారం ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇక ఈ కేసులో మొదటి నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఇక చివరకు అవినాష్ రెడ్డి చుట్టూనే ఉచ్చు బిగుస్తుడడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ కేసు ప్రభావం వైఎస్ జగన్ కూడా ముప్పే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్ ఆదేశాల మేరకే వివేకా హత్య జరిగిందనే ఆరోపణలు టీడీపీ మొదటి నుంచి కూడా చేస్తోంది. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్రంగా తదుపరి జరిగే పరిణామాలు ఏపీ రాష్ట్రంలో సంచలనాలకు దారి తీసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

గులాబీ పువ్వుతో.. ఎన్ని ప్రయోజనలో !

కేటీఆర్‌…ఒక ట్వీట్‌తో సమస్య పరిష్కారం

మహిళా బిల్లుపై దేశవ్యాప్త పోరాటం చేస్తాం

- Advertisement -