ఆసక్తికరంగా అవికా గోర్ ‘నెట్’ ట్రైలర్..

224
Avika Gor NET
- Advertisement -

హీరోయిన్‌ అవికా గోర్ – నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నెట్’ వెబ్ సిరీస్ రూపొందింది. జీ 5 వారు ఈ ఒరిజినల్ సిరీస్ ను ‘వినాయక చవితి’ కానుకగా, వచ్చేనెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నుంచి సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. అవికా గోర్ తన బోయ్ ఫ్రెండ్‌ను రహస్యంగా కలుస్తూ ఉంటుంది. ఆమె జీవితాన్ని సీక్రెట్ కెమెరా ద్వారా రాహుల్ రామకృష్ణ గమనిస్తూ ఉంటాడు. ఆయన దృష్టి మొత్తం కూడా అవికా పైనే ఉంటుంది. అందువలన భార్య దగ్గర చీకాకు పడుతూ ఉంటాడు. దాంతో ఆమెకి అనుమానం మొదలవుతుంది.

అయితే రాహుల్ రామకృష్ణ తరచూ పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ ఉంటాడు. ఎందుకోసం చేస్తున్నాడనేది స్నేహితులకు కూడా అర్థం కాదు. బోయ్ ఫ్రెండ్‌తో అవికాకు గొడవ మొదలైనప్పుడే, రాహుల్‌కి భార్యతో తగవు మొదలవుతుంది. ఆ తరువాత జరిగిదేమిటనేది ఈ సిరీస్‌ విడుదల వరకు వేచిచూడాలి.ఈ సస్పెన్స్. చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ ఇంట్రస్టింగ్‌గా ఉండేలానే అనిపిస్తోంది.

- Advertisement -