ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి సినీ అభిమాని కూడా ఒక్క సినిమా కోసం కొన్నేళ్లుగా కళ్ళు కాయలు కచేలా ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు.. ఆ మూవీని అవతార్ 2. 2009 వచ్చిన అద్భుతమైన విజువల్ వండర్ గా ప్రేక్షకులను కట్టిపడేసిన అవతార్ కి సిక్వలే ఈ అవతార్ 2 మూవీ. 2009 అవతార్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఆకట్టుకునే కథాంశం, కట్టిపడేసే విజువల్స్, మనలను వేరే ప్రపంచానికి తీసుకెళ్లి సరికొత్త అనుభూతిని పంచింది ఆ మూవీ. అప్పట్లోనే ఆ మూవీ 18 వేల కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి వరల్డ్ టాప్ గ్రాసర్ మూవీస్ టాప్ టెన్ లలో ఇప్పటికీ కూడా ఆగ్రస్థానంలో ఉంది. అలాంటి విజువల్ ట్రీట్ వండర్ మూవీ సిక్వల్ కోసం అభిమానులు 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అవతార్ సిక్వల్ ” అవతార్ 2 ” డిసెంబర్ 16 న విడుదల అయింది. కాగా ఇప్పటివరకు వచ్చిన రివ్యూల ప్రకారం మూవీ ఎలా ఉందో షార్ట్ అండ్ స్ట్రైట్ గా తెలుసుకుందాం !
కథాంశం ; మొదటి భాగం చూసిన వారికి అవతార్ 2 కథ చాలా ఈజీగా అర్థమౌతుంది. కానీ మొదటి భాగం చూడని వారికి కాస్త గందరగోళంగా ఉంటుంది. కాగా మొదటిభాగంలో మూవీ ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంతో అక్కడి నుంచే ” అవతార్ 2 ” కథ ప్రారంభం అవుతుంది. మొదటి భాగంలో పండోరా గ్రహంలో దొరికే విలువైన ఖనిజ సంపద కోసం అక్కడి స్థానిక తెగతో యుద్దానికి దిగిన మానవులు జెక్స్ ( హీరో ) కారణంగా.. ఆ తెగ చేతిలో ఓడిపోతారు. ఆ తరువాత మనుషులను భూలోకానికి పంపి జెక్స్ ( హీరో ) ఆ తెగతో పండోరా గ్రహంలో హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి అవతార్ 2 కథ ప్రారంభం అవుతుంది. మొదటి భాగంలో పండోరా తెగలోని నేతేరి ( హీరోయిన్ ) ను ప్రేమించిన జెక్స్( హీరో ) రెండవ భాగంలో వివాహం చేసుకోగా వారికి ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయి పుడుతుంది. ఇక మొదటి భాగంలో చనిపోయిన డాక్టర్ గ్రెస్..ఆమె జీన్స్ ఆధారంగా ఓ అవతార్ ను క్రియేట్ చేసి ఆ అమ్మాయికి కిరి అని పేరు పెడతారు. కిరి ని కూడా జెక్స్ నేతేరి దత్తత సుకొని సొంత బిడ్డల పెంచుకుంటూ ఉంటారు. ఇక ఓ రోజు రాత్రి మళ్ళీ మానవులు పండోరా పై దండెట్టూతారు. దాంతో తమున్నచోట సురక్షితం కాదని భావిచ్చిన జాక్ కుటంబం మెట్కయన్ అనే గ్రామంనికి సముద్రవాసులు జీవించే ప్రాంతనికి వలస వెళతారు. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జాక్ తన కుటుంబాన్ని మానవుల నుంచి ఎలా రంక్షించుకున్నాడు. అనేదే కథాంశం.
విశ్లేషణ : మొదటి భాగం చూసిన వారికి పెద్దగా కథలో కొత్తదనం కొత్తదనం కనిపించకపోవచ్చు గాని, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి సరికొత్త ప్రపంచానికి మనలను తీసుకెళతాడు. ఒక్కసారి మూవీ స్టార్ట్ తరువాత ఆ సరికొత్త ప్రపంచాన్ని చూస్తూ మనలను మనం మరియచిపోవవడం ఖాయం. నటీనటులు, సాంకేతిక నిపుణులు చూపించిన ప్రతిభ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఇలాంటి సినిమాలు తీయడంలో జేమ్స్ కామెరూన్ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించారు కామెరూన్. మొత్తానికి అవతార్ ను మించిన విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ కు గురి చేస్తుంది అవతార్ 2 మూవీ. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…