‘అవతార్ 2’… ఇప్పట్లో లేనట్లే

268
'Avatar 2' movie 'not happening' in 2018
- Advertisement -

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. అద్భుతమైన ఆ సాంకేతిక పరిజ్ఞానం .. అనూహ్యమైన విజువల్స్ చూసి ప్రేక్షకులు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఎవరూ ఊహించని సాంకేతిక పరిజ్ఞానం, విజువల్ ఎఫెక్ట్స్ తో దర్శకుడు జేమ్స్ కామెరూన్ మ్యాజిక్ చేశాడు.

ఈ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2, 3, 4, 5 పార్టులు కూడా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అవతార్ 2ను తొలుత 2017లో విడుదల చేస్తామని ప్రకటించారు తర్వాత 2018 డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది.  ‘అవతార్ 2’ పైనే కాకుండా .. ఆ తరువాత సీక్వెల్స్ పై కూడా చిత్ర యూనిట్ పనిచేస్తోందని అందుకే సినిమా విడుదల ఆలస్యమవుతున్నట్లు కామెరూన్ వెల్లడించారు.

తన కెరీర్‌లో కేవలం అవతార్ సినిమాలు మాత్రమే తీస్తానని, అవతార్ ఐదో భాగం తీసే సమయాని నా జీవితం చివరి దశకు చేరుకుంటుంది అంటున్నారు కామరూన్. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ వయసు 62 సంవత్సరాలు. అవతార్ మొగిలిన నాలుగు పార్టులకు సంబంధించిన పనులు కూడా చకచక జరుగుతున్నాయి. కామెరూన్ చెబుతున్నట్లుగా  2019లో లేదా 2010లో సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రతి ఏడాదికి ఒకటి చొప్పున వరుసగా మిగిలిన సీక్వెల్స్ విడుదల కాబోతున్నాయి.

- Advertisement -