బికినీతో హీట్‌ పుట్టిస్తోంది..

248
- Advertisement -

ఆ అమ్మడి అందాలకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. నిజం చెప్పాలంటే ఆ బ్యూటీ  అందాలు యూత్‌కి కిక్కెక్కిస్తాయి.  అటు ఫ్యాన్సేకాదు  లారెన్స్‌ కూడా ఆ అందాలకు ఫిదా అయిపోయాడు. అందుకే  ఆ భామని మిస్‌ చేసుకోకుండా తెగ ఆఫర్లు ఇచ్చేస్తున్నాడు రాఘవ లారెన్స్‌. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనేగా మీ సందేహం. ఆ భామే రాయ్‌ లక్ష్మి.
 Raai Laxmi to act lawrance film in bikini
తన అందచెందాలతో ఫిదా చేస్తుంది కాబట్టే..చిరులాంటి వారు కూడా వదిలిపెట్టలేదు. అందుకే రత్తాలూ..రత్తాలూ అంటూ వెంటపడ్డాడు మెగాస్టార్‌.  అయితే ఈ ర‌త్తాలుని లారెన్స్ వ‌దిలిపెట్ట‌డం లేదు. అత‌డు న‌టిస్తున్న ప్ర‌తి సినిమాలోనూ ఓ ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు. అందుకే  లారెన్స్ ఎక్క‌డ ఉంటే ర‌త్తాలు అక్క‌డ ఉంటుంది. ర‌త్తాలు ఎక్క‌డ ఉంటే లారెన్స్ అక్క‌డ ఉంటున్నాడు. ఏదేమైనా ర‌త్తాలుతో మారోసారి లారెన్స్ మాష్టార్ వండ‌ర్ ఫుల్ ఫీట్ వేయించారు.

తాజాగా లారెన్స్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా రానుంది. ఆ సినిమానే ‘మొట్ట శివ కెట్ట శివ‌’. ఈ సినిమాలో ర‌త్తాలు రాయ్ ల‌క్ష్మీ చేత అదిరిపోయే ఐటెమ్ సాంగ్‌ని  చేయిస్తున్నాడు. అంతేకాకుండా బికినీలో రాయ్ ల‌క్ష్మీ అందాల్ని అంతే గొప్ప‌గా ఆవిష్క‌రిస్తున్నాడు లారెన్స్.  అయితే..తాజాగా  రాయ్‌ లక్ష్మి బికినీ వేసిన ఫోటో ఒక‌టి సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. అంతే కాదు కుర్రకారులో హీట్ ని కూడా పెంచేస్తోంది. మొత్తానికి లారెన్స్‌ కోసం రత్తాలు బికినీలో కనిపిస్తోందన్నమాట.

- Advertisement -