ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అవతార్-2లో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఊహించని అంచనాల మధ్య విడుదల కావడం విశేషం. 2009లో వచ్చిన అవతార్ కు సీక్వెల్‌కు ఈ సినిమా రూపొందించారు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రతిసృష్టికి ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండరు. పండోరా అనే ఒక కొత్త గ్రహాన్ని సృష్టించి దానిలోకి మనల్ని తీసుకెళ్లాడు. జేమ్స్ కామెరూన్ ఈ సినిమా సీక్వెల్‌ను సముద్ర గర్భంలో ఆవిష్కరించాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించింది.
ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి అవతార్ ది వే ఆఫ్ వాటర్ అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్‌లో కేవలం 10కోట్లు వసూలు రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు గతంలో డాక్టర్ స్ట్రేంజ్ పేరిట ఉండేది ఇప్పుడు అవతార్ 2కు వచ్చింది. హాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలంటే 2బిలియన్ డాలర్లు సాధించాల్సి ఉంటుందని టాక్. ఈ సినిమా దాదాపు 160 దేశాల్లో డిసెంబర్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి…