హోదా పోరు…’గుంటూరోడు’ ఆడియో వాయిదా

225
GUNTURODU movie Audio Postponed
- Advertisement -

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దమైంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అశేష స్పంద‌న ల‌భిస్తుంది. మ‌నోజ్ గ‌త చిత్రాలను మైమ‌రింపచేసేలా, ఈ మాస్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

ఈ సంద‌ర్భంగా … చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ “లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు చిత్ర ఆడియో ఈ నెల 26న జ‌రుగుతుందని ప్రకటించారు. అయితే సన్నిహితులు,ఫ్యాన్స్ విజ్ఞప్తి మేరకు గుంటూరోడు ఆడియో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంచు మనోజ్ ప్రకటించారు. ఈ నెల 26న ఏపీకి ప్రత్యేక హోదా కోరుతు పెద్ద ఎత్తున ఆందోళన జరగనున్న నేపథ్యంలో ఆడియో రిలీజ్ వేడుకను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మనోజ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు యువత చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆడియో ఎప్పుడు విడుదల చేస్తామన్న దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని పోస్టర్ ద్వారా మనోజ్ తెలిపారు.

GUNTURODU movie Audio Postponed

మంచు మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలలో న‌టిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -