ఆస్ట్రియాలో మళ్లీ లాక్ డౌన్!

255
austria
- Advertisement -

కరోనా రెండో దశ వ్యాక్సిన్‌ విజృంభించే అవకాశం ఉండటంతో పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ బాటపట్టాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ లాక్ డౌన్ తేదీలను ప్రకటించగా తాజాగా ఆస్ట్రియా,బ్రిటన్ కూడా లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నాయి.

ఇక ఆస్ట్రియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో నాలుగు వారాలపాటు పాక్షిక లాక్‌డౌన్‌ ప్రకటించారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రజలు ఇండ్లు వదిలి బయటకు రావద్దని ఆదేశాలు జారీచేశారు. బార్లు, రెస్టారెంట్లు, సాంస్కృతిక, క్రీడా స్థలాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇక బ్రిటన్ కూడా మళ్లీ లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నాయి.

కరోనా నుండి తప్పించుకునేందుకు లాక్ డౌన్ పరిష్కార మార్గమని తెలిపిన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రోన్..దేశంలో లాక్‌డౌన్ 30 రోజులు కొనసాగుతుందని వెల్లడించారు. జర్మనీలో నవంబర్ 2 నుంచి 30 వరకూ లాక్‌డౌన్‌లో భాగంగా అన్నీ మూసివేయాలనీ, స్కూళ్లు, మార్కెట్‌లను మినహాయించినట్లు మార్కెల్ తెలిపారు.

- Advertisement -