దిగొచ్చిన బంగారం ధరలు..

214
gold
- Advertisement -

బంగారం ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.570 తగ్గుదలతో రూ.51,650కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 తగ్గి రూ.47,340కు చేరింది.

బంగారం ధరలు పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర గత మూడు రోజుల్లో రూ.3100 పెరిగి రూ.65,200గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1907 డాలర్ల నుంచి 1878 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 23.71 డాలర్లకు తగ్గుముఖం పట్టింది.

- Advertisement -