- Advertisement -
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచులోనూ వెస్టిండీస్ చిత్తుగా ఓడింది. ఈ మెగా టోర్నీని హాట్ ఫేవరేట్ గా ప్రారంభించిన విండీస్ కేవలం ఒక్క విజయంతో ఇంటి బాట పట్టింది. దీంతో సూపర్-12 దశను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. ఈరోజు వెస్టిండీస్‌తో జరిగిన పోరులో ఆసీస్ జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది. విండీస్ తమ ముందుంచిన 158 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 16.2 ఓవర్లలోనే ఛేదించారు.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 9 పరుగులకే అవుట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ 53 పరుగులు చేశాడు. ఈ విక్టరీతో సెమీస్ రేస్‌లో మరింత ముందుకు దూసుకెళ్లింది ఆస్ట్రేలియా టీమ్.
- Advertisement -